భువనగిరి టౌన్ (జనం సాక్షి ):–భువనగిరి పట్టణంలో స్థానికంగా ఉన్న ఏకే ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో సంక్షేమ సంబరాలు కార్యక్రమంలో పాల్గొని భువనగిరి నియోజకవర్గానికి చెందిన 369 కళ్యాణ లక్ష్మి చెక్కులను మరియు 67 షాద్ ముబారక్ (మొత్తం 436) చెక్కులను చెక్కులతో పాటు ఎమ్మెల్యే గారి సొంత డబ్బుతో పోచంపల్లి పట్టుచీర దోతి టవల్ని ఆడపడుచు లాల్చడం గా లబ్ధిదారులకు అందజేశారు, దళిత బంధు పథకం ద్వారా మంజులైన 3 యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు అలాగే నియోజకవర్గంలోని చేనేత సహకార సంఘాలకు మొత్తం 10 కోట్ల 90 లక్షల రూపాయలు మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు .అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఈరోజు సీఎం కేసీఆర్ గారి చేతుల మీదుగా కుల వృత్తులకు చేయూత పథకం ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా మంజులైన 1 లక్ష రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు, గొర్రెల పెంపక దారులకు ప్రభుత్వ అందజేస్తున్న ఉచిత గొర్రెల పంపిణీ కార్యక్రమం కింద మంజూరైన యూనిట్లను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో అత్యంత ఇష్టమైన పథకం కళ్యాణ్ లక్ష్మి షాద్ ముబారక్ పథకాలని తెలియజేశారు… రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఉచిత కరెంటు, రైతులకు రైతుబంధు, రైతు బీమా రైతులకు చేయూతనిచ్చే పథకాలు మరెన్నో కేసీఆర్ గారి ప్రవేశపెట్టారని తెలియజేశారు.చిన్న తండాలను కూడా గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత కేసిఆర్ గారిని పేర్కొన్నారు.జిల్లాలో కొత్త కలెక్టరేట్ల నిర్మాణం చేసిన ఘనత కెసిఆర్ గారిధి తెలియజేశారు.తద్వారా ప్రజల వద్దకు పాలన చేరువైందని తెలియజేశారు..గ్రామాలకు పచ్చని తోరణంల హరితహారం కార్యక్రమం విజయవంతమైందని తెలియజేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు ఇంతగానో నీటి కష్టాలతో బాధపడ్డారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు గాని ప్రజలకు గాని నీటి కష్టాలు తీరాయని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమం సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో విద్యుత్ సమస్య గాని నీటి సమస్య గాని ఏ విధంగా పరిష్కరించాలో ముందుగానే ఆలోచించి నా ఒక విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ గారిని తెలియజేశారు..దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతు కష్టాలను తీర్చిన రైతు బాంధవుడు కెసిఆర్ గారు అని తెలియజేశారు.భువనగిరి పట్టణంలో రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో బతుకమ్మ ఆడిన తర్వాత బతుకమ్మలు వేయడానికి చెరువులలో నీళ్లు లేవని జెసిపి తో తొవ్వించి వాటర్ ట్యాంకులతో నీళ్లు పోసి అందులో వేసామని, కానీ ఇప్పుడు బస్వాపూర్ ప్రాజెక్టు వల్ల బీబీనగర్ పెద్ద చెరువులో కానీ భువనగిరి పెద్ద చెరువులో గాని నీరు పుష్కలంగా ఉన్నాయని ఈ ఘనత కేసిఆర్ గారిదే తెలియజేశారు.
ప్రజల నీటి కష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి గడపగడపకు మంచినీరు అందించిన మహా వ్యక్తి కెసిఆర్ గారిని తెలియజేశారు.రాష్ట్రం ఏర్పడక ముందు రైతులు తమ పండించిన ధాన్యాన్ని అమ్మడానికి దళారులతో మోసపోయేవారని, కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రైతు వద్ద నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసి డబ్బులను రైతు ఖాతాలో జమ చేస్తుందని ఇలాంటి ప్రభుత్వం దేశంలోనే ఎక్కడ లేదని పేర్కొన్నారు.రైతుబంధు పథకం ద్వారా రైతులకు ఎంతగానో మేలు జరుగుతున్నదని తెలియజేశారు. టిఆర్ఎస్ నాయకులు నాయకులు పీఏసీ చైర్మన్ పరమేశ్వర్ రెడ్డి మార్కెట్ రాజేందర్ రెడ్డి చైర్మన్ గ్రంధాలయ చైర్మన్ జడల అమరేందర్ రైతు కన్వీన ర్ కొలుపుల కమలాకర్ జడ్పిటిసి బీరు మల్లయ్య ఎంపీపీ నిర్మల మున్సిపల్ చైర్మన్ 80 ఆంజనేయులు చైర్మన్ చింతల కిష్టయ్య వివిధ మండల నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ నాయకులు జనగాం పాండు మాజీ ఎంపీపీ కేశపట్నం రమేష్ మాజీ పిఎస్సి చైర్మన్ బల్మూరు బస్సుదన్ రెడ్డి జక్క రాఘవేందర్ రెడ్డి శ్యామల వెంకటేష్ మద్ది బుచ్చిరెడ్డి చిన్నం పాండు బొమ్మరు సురేష్ మల్లికార్జున్ ర్యాకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
vతెలంగాణ దశాబ్ది ఉత్సవాలు సంక్షేమ సంబరాలు దళిత బంధు ప్రాది ముబారక్ చెక్కులు అందజేసిన చేసిన ఎమ్మెల్యే




