Wednesday, 4 November 2026

జోగులాంబ ఆలయాన్ని దర్శించుకున్న జిల్లా అదనపు కలెక్టర్ .

 

 

 

 

 

 

 

అలంపూర్ జనంసాక్షి (జూలై 7)అలంపుర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను శుక్రవారం జోగులాంబ జిల్లా కు నూతనంగా వచ్చిన అదనపు కలెక్టర్ సిహెచ్ శ్రీనివాస్, ఆర్డీవో రాములు దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఈ.ఓ. పురేందర్ కుమార్, ముఖ్య అర్చకులు డి. ఆనంద్ శర్మ లు స్వాగతం పలికారు.
.ఉభయ ఆలయాలలో ప్రత్యేక పూజలు చేయించి శాలువా పూలమాల వేసి మెమోంటో అందజేశారు. అనంతరం వేద పండితులతో తీర్థప్రసాదాలు, వేద ఆశీర్వచనం చేయించారు. వీరి వెంట అలంపూర్ తహసీల్దార్ సుభాష్ నాయుడు ఉన్నారు.