
జనం సాక్షి, చెన్న రావు పేట
మండలము లోని లింగాపురం గ్రామంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్ తో పాటుగా నోటుబుక్స్ పంపిణి చేసినట్టు లింగాపురం గ్రామ సర్పంచ్ తప్పేట రమేష్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని, పిల్లలు ప్రభుత్వ బడులలో చేరి పాఠశాలలను కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నోడల్ ఆఫీసర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహనరావు,విద్యాకమిటీ చైర్మన్ తాళ్లపెల్లి స్వామి, ఉపాధ్యాయులు సురేష్, రమణయ్య,ఇంద్రకరుణాకర్ రెడ్డి,కుమారస్వామి, పరమేశ్వర్,జయశ్రీ, రాజసులోచన,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




