గద్వాల నడిగడ్డ, జులై 1 (జనం సాక్షి):ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి విద్యతో ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు వ్యాపారం చేస్తున్న జిల్లా యంత్రాంగం, అధికార పార్టీ నాయకులు గాని ప్రైవేటు స్కూల్ ఫీజుల దోపిడిని పట్టించుకునే వారే లేరని జోగులాంబ గద్వాల జిల్లా ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ అన్నారు.
లక్షలు ,వేలు ఫీజులు వసూలు చేస్తూ ప్రయివేట్ విద్యాసంస్థలు చదువుల దందా చేస్తున్నాయని, అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వెంకటేష్ జిల్లా విద్యా శాఖ అధికారి సిరాజుద్దీన్ కి శనివారము ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.యూనిఫామ్ ,బుక్స్ అని కల్చరల్ ఆక్టివిటీస్ అనే పేరుతొ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తల్లితండ్రులను ముక్కు పిండి వసూలు చేస్తున్న విద్యా శాఖ అధికారులు మాత్రం పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారనీ,అధిక ఫీజుల విషయం లో ఏటా ప్రభుత్వం హెచ్చరిస్తున్న ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యం మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారు.పాఠశాలలో విద్యాశాఖ అధికారులు నామమాత్రపు తనిఖీలు నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారనీ,జిల్లా కేంద్రం లో కొన్ని పాఠశాలలో లక్షల ఫీజులు వసూలు చేస్తూ డిగ్రీ పూర్తి చేసిన వారితో చదువు చెప్పిస్తూ విద్యార్థుల చదువులతో చెలగాటం ఆడుతున్నారనీ, .ప్రయివేట్ విద్యా దోపిడీ అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పట్టించుకునే వారు లేరని ఆయన అన్నారు.విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని ప్రైవేటు స్కూల్ యజమానులు ఫీజుల రూపంలో జలగల్లాగా పట్టిపీడిస్తున్న ప్రయివేట్ పాఠశాలలపై చర్య తీసుకోకపోతే తొందర్లోనే పెద్దఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో విద్యారి నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రయివేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీ పట్టించుకునే వారు లేరు -ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్.




