Tuesday, 3 November 2026

నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన అఖిలభారత సహకార బ్యాంకు ఉద్యోగులు.

వలిగొండ జనం సాక్షి న్యూస్ జూలై1 వలిగొండ మండల కేంద్రంలో అఖిలభారత సహకార ఉద్యోగుల అసోసియేషన్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ శనివారం ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సహకార ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ కోపరేట్ వ్యవస్థలో రెండంచెల విధానం ప్రవేశపెట్టాలని సహకార బ్యాంకులలో సరిపడా మూలదనం ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే విధంగా అమలు చేయాలని కోపరేట్ బ్యాంకులో పనిచేయుచున్న ఉద్యోగులకు పెన్షన్ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సహకార బ్యాంక్ జిల్లా డైరెక్టర్ శ్రీకాంత్ శ్రీలత రైతులు తదితరులు పాల్గొన్నారు.