మర్పల్లి మే 15 (జనం సాక్షి) యువత క్రీడలపై దృష్టి సాధించాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని మండల పరిషత్ అధ్యక్షురాలు బంటు లలితా రమేష్ అన్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో ఎస్టీ ఆశ్రమ పాఠశాల లో సోమవారం ఎంపీపీ బంటులలితా రమేష్, జెడ్పీటీసీ మధుకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న యువతలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించేందుకు సీఎం కప్పు 2023 టోర్నమెంటును నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బంటులలితా రమేష్, జెడ్పీటీసీ మధుకర్, కో ఆప్షన్ మెంబర్ సోయల్ షరీఫ్, ఎంపిడిఓ రాజ మల్లయ్య, ఎంఈఓ విద్యాసాగర్, ఎం పి ఓ మహేష్, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.




