Wednesday, 4 November 2026

జోగులాంబ సన్నిధిలో జోగులాంబ జోన్ డి.ఐ.జి

జోగులాంబ సన్నిధిలో జోగులాంబ జోన్ డి.ఐ.జి అలంపూర్ జనంసాక్షి (జనవరి 06)అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వార్లను శుక్రవారం జోగులాంబ జోన్ డి.ఐ.జి. లాల్ శంకర్ చౌహాన్ దర్శించు కున్నారు.డి. ఐ.జి. చౌహన్ కు ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, అర్చకులు పూర్ణకుంభం తో స్వాగతం పలికారు. ఈసందర్బంగా అయన ఉభయ ఆలయలలో ప్రత్యేక పూజలు చేసి, తీర్థం ప్రసాధం అందజేశారు. అనంతరం ఆయనకు శాలువా, పూలమాల వేసి సత్కరించారు.వీరితో పాటు జోగులాంబ జిల్లా డి.యస్.పి. రంగస్వామి, అలంపూర్ సి.ఐ. సూర్య నాయక్, యస్.ఐ. శ్రీహరి వున్నారు.