చివరి రోజు కావడంతో హడావిడి
హైదరాబాద్,నవంబర్19(జనంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్ల పక్రియ సోమవారం చివరి తేదీ కావడంలో పలుచోట్ల నామినేషన్లు జోరుగా సాగాయి. ఆయా పార్టీల అభ్యర్థులు ర్యాలీలతో నామినేషన్ దాఖలు చేసారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున బరిలో నిలిచిన అభ్యర్థులతో పాటు రెబల్స్ కూడా నామినేషన్లు వేసారు. టికెట్ దక్కని కొంతమంది ఆశావహులు ఇండిపెండెంట్‌గా పోటీకి నిలబడుతున్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్‌రెడ్డి ఎన్నికల అధికారికి నామపత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి గా నామినేషన్ వేయడానికి ముందు జగదీష్ రెడ్డి – సునీత కుటుంబ సభ్యులతో కలిసి సూర్యాపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యాపేట బీజేపీ అభ్యర్థిగా సంకినేని వెంకటేశ్వర్‌రావు నామినేషన్ వేశారు. కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వినోద్ కుమార్ పాల్గొన్నారు. నామినేషన్ల కార్యక్రమానికి టీఆర్‌ఎస్ శ్రేణులు భారీ ప్రదర్శనలు నిర్వహించారు. మెదక్‌లో మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పండుగ వాతావరణంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమం గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.
ముషీరాబాద్ నియోజకవర్గానికి సేవచేస్తా: గోపాల్
భారీ ర్యాలీతో ముషీరాబాద్ టిఆర్‌ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ నామినేషన్ వేశారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ,మేళతాళాలతో స్థానిక అమ్మవారి ఆలయంలో పూజలు నిర్కవహించి ముందుకు సాగారు. ఈ సందర్భంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. తెరాస టికెట్ల వ్యవహారంలో తీవ్ర ఉత్కంఠ రేకెత్తించిన ముషీరాబాద్ అభ్యర్థి ఎంపిక చివరికి సుఖాంతమైంది. ముషీరాబాద్ తెరాస అభ్యర్థి ముఠాగోపాల్‌కు మంత్రి
నాయిని నరసింహారెడ్డి బి-ఫారం అందజేశారు. మొత్తం 119 స్థానాలకు గాను శనివారం వరకు పెండింగ్‌లో పెట్టిన రెండు స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేశారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నవారివైపు అధిష్ఠానం మొగ్గు చూపింది. కోదాడకు బొల్లం మల్లయ్య యాదవ్, ముషీరాబాద్‌కు ముఠాగోపాల్‌ను ఖరారు చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే వీరి పేర్లను ఆదివారం అధికారికంగా ప్రకటించారు. బర్కత్‌పురలో నాయిని చేతుల విూదుగా ముఠాగోపాల్ బి-ఫారం అందుకున్నారు. అయితే ఈ స్థానంలో తన అల్లుడిని బరిలోకి దించేందుకు నాయిని పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. కేసీఆర్ నచ్చజెప్పడంతో నాయిని వెనక్కితగ్గారు.




