Tuesday, 3 November 2026

సికిల్ సెల్ పై అవగాహన సదస్సు.

శనివారం ముల్కాలలోని డి.యం.హెచ్.ఓ కార్యాలయంలో శిక్షణ పొందుతున్న మందమర్రి, కాసిపెట్, తాళ్ళపేట్, వెకట్రావు పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆశా వర్కర్లకు, జూన్ 19 న ప్రపంచ సికిల్ సెల్ దినాన్ని పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సికిల్ సెల్ వ్యాధి పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ,ఈసందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యఅతిథులుగా మంచిర్యాల డి.యం.హెచ్.ఓ సుబ్బారాయుడు మాట్లాడుతూ భారతదేశ దేశ వ్యాప్తంగా సికిల్ సెల్ వ్యాధిని అరికట్టడానికి ఈ నెల 27 న భారత ప్రధాని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వ్యాదికి సంబందించిన సికిలింగ్ టెస్ట్ లు ఇప్పుడు పుట్టిన పిల్లల నుండి 18 సం.ల పిల్లల వరకు, శిశు నుండి 10 వ తరగతి విధ్యార్తిని విధ్యార్థుల వరకు టెస్ట్లు చేయాలని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రదనమంత్రి చేతుల మీదుగా ప్రారంబించ నున్నారు. మొదట మంచిర్యాల జిల్లాలొని మండలాల మందమర్రి, దండేపల్లి, తాళ్ళపేట్, కాసిపేట్ నాలుగు మండలాలలో ఈనెల 27 న సికిలింగ్ టెస్టులు చేసి వ్యాదిని అరికట్టడానికి చేస్తున్నామని తెలిపారు.మంచిర్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు కాసర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి తీవ్రత ఎక్కువగా వున్నదని వ్యాధి లేనిజిల్లాగా వ్యాధిలేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని వ్యాధి లేని రాష్ట్రంగా వ్యాధి రహిత రాష్ట్రగా మార్చాలని రాష్ట్రంలో చిన్నపిల్లల నుండి పెండ్లి వయస్సు వచ్చినవారు నర్సరీ నుండి పిజి విద్యార్థలు పెండ్లి వయసు వచ్చిన వారు పెండ్లికి ముందు Hba2 అందరూ రక్త పరీక్షలు చేసుకోవాలని అన్నారూ.

మన జనాభాలో ప్రతి 100 మందిలో 5 గురు తలసేమియా సికిల్ సెల్ వ్యాధి వాహకాలు వున్నారు ఈ వ్యాధి వాహకాలను గుర్తించి కౌనిస్సిలింగ్ చేసి వాయకులు ఇద్దరు కలిసి పెండ్లి చేసుకోకుండా చూడాలని ఎలాచేస్తే వ్యాధిని అరికట్టవచ్చునని అన్నారు మన భారత దేశంలో ప్రతి సంవస్సారం 12 వేలా మంది జన్మిస్తున్నారు.మన ఉమ్మడి రాష్ట్రాలలో 5000లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 500 మన మంచిర్యాల జిల్లాలో 200 నుంచి 300 మంది బాధపడుతున్నారు అని అన్నారు.

తలసేమియా సికిల్ సెల్ వ్యాధిని నివారించుటకు పెండ్లికి ముందు యువతి యువకులకు హెచ్ బి ఎ 2అనే రక్తపరిక్షలు చేసుకోవాలి ఈ పరీక్షలో ఇద్దరు వ్యాధి వాహకాలు పెండ్లి చేసుకోకూడదు ఒకవేళ పెండ్లి చేసుకుంటే పుట్టబోయే సంతానం 50 శాతం నార్మల్ 25 శాతం వ్యాధి వాహకాలు 25 శాతం వ్యాధిగ్రస్థులుగా పుడతారు వ్యాధిగ్రస్తులకు వ్యాధి తివ్రతను భట్టి నెలకు ఒకేసారి రక్తం ఎక్కించాలి తరుచు కీళ్ళ నొప్పులతో బాధపడుతారు జ్వరం వచ్చినప్పుడు రక్తం పగిలి పోతుంది కడుపులో బల్ల తాయారు అవుతుంది ఖరీదైన మందులు వాడాలి వ్యాధి పూర్తిగా నయం కావడానికి బోన్ మ్యారో మార్పిడి చెయ్యాలి ఇది చాలా ఖరీదైన ట్రీట్మెంట్ 25 లక్షలు ఖర్చు అవుతుంది అని అన్నారు . జిల్లాల లోని సేవసంస్థలు మరియు విద్య సంస్థలు ముందుకు వచ్చి వ్యాధిపై అవగాహన సదస్సులో నిర్వహించాలని వ్యాధి లేని తెలంగాణ వ్యాధిరహిత సమాజం స్థాపించదానికి ప్రతి ఒక్క సేవాసంస్థలు ముందుకు రావాలని అవగాహన సదస్సులు నిర్వహించాలని అన్నారు.

మంచిర్యాల రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో తల సేమియా సికిల్ సెల్ వ్యాధి నిర్దారణ పరీక్ష హెచ్బి ఎ 2కేవలం రూ.350/- రూపాయలు తీసుకోవడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు వైద్య పరీక్షలు చేసుకోవాలని కొరినారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు డి.యం.హెచ్.ఓ సుబ్బరాయుడు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు కాసర్ల శ్రీనివాస్, తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్, ఇన్చార్జి డిపి.హెచ్.ఎన్ రత్నమాల సూపర్వైజర్ లు, ఆర్ఎస్ పద్మ, సరోజ కమల పుష్పవల్లి తదితరులు పాల్గొన్నారు.