Wednesday, 4 November 2026

లంకాసాగార్ పీహెచ్ సి వైద్యులకు ప్రశంసా పత్రాలు

 

 

 

 

 

 

 

 

పెనుబల్లి, జనవరి 26(జనం సాక్షి) జనవరి 26 ఘణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఖమ్మంలో
వైద్య రంగంలో ఉత్తమ సేవలందించినందుకు లంకసాగర్ పి హెచ్ సి వైద్యులు డాక్టర్ కిరణ్ కుమార్ , స్టాఫ్ నర్స్ స్రవంతి లకు జిల్లా కలెక్టర్ వి సి గౌతమ్ చేతులమీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు , ఈ సంధర్భంగా డా. కిరణ్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్ సమయం లో సిబ్బంది అందరు అహర్నిశలు పనిచే సారని ప్రభుత్వ ఆసుత్రుల్లో కాన్పులు శాతం పెంచార ని సిబ్బంది సమిష్టి కృషితో నే ప్రశంసా పత్రాలు లభిం చాయని అన్నారు, స్టాఫ్ నర్స్ స్రవంతి మారుమూల ప్రాంతం లో ఉన్న పి హెచ్ సి కి వచ్చిన గర్భిణి స్త్రీలకు అవసరమైన అన్ని రకాల సేవలను అందించారని, ఏ సౌకర్యాలు అందుబాటులో లేకపోయినా కానీ గడచి 6 నెలల కాలంలో వైద్యుల సహకారం తో 40 వరకూ సాధారణ కాన్పులు చెయ్యడం లొ తన వంతు కృషి చేశార ని అన్నారు, వీరికి పి హెచ్ సి సిబ్బంది శ్రీనివాస్, ప్రకాశ్ రావు, నాగేశ్వర రావు, ప్రమీల, పొట్టేమ్మ, నిర్మల కుమారి కృష్ణవేణి, మంగతాయమ్మా, వరలక్ష్మీ, ఉదయ కుమారి, ఇష్రత్ బేగం, నాగేశ్వరి, శాంతమ్మ, ,కుమారి రవి కుమార్, ఖరీం ముల్లా తదితరులు అభినందలు తెలియజేసినారు