Tuesday, 3 November 2026

జ్ఞానోదయ కాలేజీలో ఈద్ ఉత్ మిలాప్

 

 

 

 

మెట్పల్లి టౌన్, ఏప్రిల్ 29,జనంసాక్షి :మెట్ పల్లి పట్టణ కేంద్రంలోని జ్ఞానోదయ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఆధ్వర్యంలో శనివారం రోజున ఈద్ ఉత్ మిలాప్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కళశాల కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ మాట్లాడుతూ మా కాలేజీ పరిధిలో అన్ని పండుగలు సమానంగా చూస్తామని, అలాగే రంజాన్ పండుగ పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.దీనిలో భాగంగా పలువురు మైనారిటీ నాయకులను, మైనారిటీ అధ్యాపకులను ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ , ప్రిన్సిపల్ సంతోష్. వైస్ ప్రిన్సిపాల్ రాజు, డైరెక్టర్ కమలాకర్, అఖిల్,హైదర్,ముని,మొహిద్దిన్ గౌస్, రహీం, ఫిర్దూస్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.