జ్ఞానోదయ డిగ్రీ, పీజీ కాలేజీలో రంగవల్లి పోటీలు
మెట్పల్లి టౌన్, జనవరి 11,
జనంసాక్షి :
మెట్పల్లి పట్టణంలోని జ్ఞానోదయ డిగ్రీ , పీజీ కళాశాలలో సంక్రాంతి వేడుకల లో భాగంగా ముందస్తు ముగ్గుల,రంగవల్లి పోటీలు ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ మాట్లాడుతూ మన తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా అన్ని పండుగలను సాంప్రదాయా పద్ధతిలో ఘనంగా నిర్వహించుకోవాలని,
దీని ద్వారా భావితరాల విద్యార్థిని విద్యార్థులకు పండుగల విశిష్టత గురించి అవగాహన వస్తుందని అన్నారు,రంగవల్లి పోటీల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ ఎఫ్సిబా పాల్గొన్నారు,ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ ,కళాశాల డైరెక్టర్ వేణుగోపాల్, కమలాకర్ రావు, మహేందర్ ,కళాశాల ప్రిన్సిపాల్ కెవి సంతోష్ ,వైస్ ప్రిన్సిపాల్ రాజు, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు .
జ్ఞానోదయ డిగ్రీ, పీజీ కాలేజీలో రంగవల్లి పోటీలు




