విద్యాసంస్థలలో మత రాజకీయాలా!
మల్లికార్జున్ (టీచర్)పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి.
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కోటగిరిలో భారీ ఎత్తున నిరసన.
కోటగిరి జనవరి 11 జనం సాక్షి:-కోటగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధుల్లు నిర్వర్తిస్తున్న మల్లికార్జు న్ అనే ఉపాధ్యాయునిపై కొందరు మతోన్మాదులు దౌర్జన్యంగా దాడి చేసి చట్ట వ్యతిరేకంగా వ్యవహరిం చిన తీరుకు నిరసనగా బుధవారం రోజున కోటగిరి మండల కేంద్రంలో ప్రజా సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఛలో కోటగిరి కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు.ఈ సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుండి పలువురు ప్రజా సంఘాల నాయకులు ర్యాలీగా బయలుదేరి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్,బాబు జగ్జీవన్ రాయ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ర్యాలీగా నిరసన ప్రాంగణానికి చేరుకొన్నారు.ఈ సందర్భంగా పలువు రు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ……….
మతం మనిషి వ్యక్తి గతం కానీ కొందరు మతోన్మాదు లు మాత్రం మతంతో రాజకీయం చేయాలనుకుంటు న్నారు.సమాజంలో ప్రతి ఒక్కరు మూఢనమ్మకాలన్ని విడనాడి శాస్త్రియ దృక్పథాన్ని పెంపొందించు కోవాలనే భారత రాజ్యాంగం ఆర్టికల్ 51aలో పేర్కొన్న విధంగా సైటిఫిక్ అంశాలను నమ్మాలనే విధంగా మల్లికార్జున్ పేర్కొన్న విషయాలను కొందరు వ్యక్తులు ఆ విషయాన్ని మతోన్మాద దిశగా పురిగొలి పి షెడ్డుల్ కులాలు,తెగలను హింసిస్తున్నరని అన్నారు.ఇలాంటి మతోన్మాదులు నుండి భారత రాజ్యాంగాన్ని,బావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవల సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.మల్లికార్జున్ టీచర్ పై పెట్టిన తప్పుడు కేసును వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకు లు డిమాండ్ చేశారు.భావి భారత పౌరులకు తీర్చి దిద్దే ఒక ఉపాధ్యాయుని పై మతోన్మాదులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ బాధ్యులను వెంటనే ఎస్సి,ఎస్టి అట్రాసిటీ కేసును నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. భవిష్యత్లో మరో ఉపాధ్యా యునికి ఇలాంటి ఘటనలు జరగకుండా లౌకిక ప్రజాస్వామ్యన్ని పరిరక్షించుకోవాలసిన భాద్యత అందరిపై ఉందనీ పేర్కొన్నారు.ఈ నిరసన కార్యక్రమంలో సిపీఐ ఎమ్ఎల్ ప్రజాపంత జిల్లా నాయకులు ప్రభాకర్, సిపిఐ ఎం జిల్లా కార్యదర్శి రమేష్,సీఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్,సీఐటియు జిల్లా అద్యక్షులు శంకర్ గౌడ్,రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎశాల గంగాధర్,బిఎస్పీ నియోజకవర్గ నాయకులు నీరడి ఈశ్వర్,స్వెరోస్ రాష్ట్ర నాయకులు కలిగొట్ సాయన్న,మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి సరిత,సేవ్ సొసైటీ జిల్లా అద్యక్షులు లింబుర్ లక్ష్మణ్,ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు కేశపురం రమేష్,బిఎస్పీ జిల్లా కోశాధికారి గణేష్,రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధరప్ప,ఎస్ఎఫ్ఐ,సిపిఐ,ఏఐఎస్ఎఫ్,పిడిఎస్ యు,ఐఎఫ్టియు,సిఐటియు,సిపిఐఎం,పివైఎల్,ఐ ఎఫ్టియు నాయకులు,బహుజన మేదవులు, యువకులు,విద్యార్థులు,నాయకులు,తదితరులు పాల్గొన్నారు.




