జ్యోతి అఖిల భారత బస్సు యాత్రను జయప్రదం చెయ్యండి.జ్యోతి అఖిల భారత బస్సు యాత్రను జయప్రదం చెయ్యండి.
దేవరుప్పుల, డిసెంబర్ 01(జనం సాక్షి):దేవరుప్పుల మండలంలోని కడవెండి గ్రామంలో జరుగు అమరవీరుల డిసెంబర్ 5 న జరిగే జ్యోతి అఖిల భారత బస్సు యాత్ర బహిరంగ సభను జయప్రదం చేయాలని రాష్ట్ర కమిటీ సభ్యులు మోకు కనక రెడ్డి తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సింగారపు రమేష్ నిలుపునిచ్చారు.ఈ సందర్భంగా కడవెండి గ్రామంలో వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య స్తూపం వద్ద నివాళులర్పించి బహిరంగ సభ ప్రదేశాన్ని పరిశీలించారు.అనంతరం వారు మాట్లాడుతూ అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు డిసెంబర్ 13 నుండి 16 వరకు కేరళ రాష్ట్రంలోని త్రిసూర్‌లో జరగనున్నాయనిఈ మహాసభలను పురస్కరించుకొని దేశంలో రెండు ప్రాంతాల నుండి అమరవీరుల జ్యోతి యాత్ర ప్రారంభం కానుందనితెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి కోసం భుక్తి కోసం వెట్టిచారి విముక్తి కోసం సాగిందనిఈ పోరాటంలో దొడ్డి కొమురయ్య తొలి అమరుడనికావున దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో భవిష్యత్తులో భూ పోరాటాలు నిర్వహించాలనిఅందుకోసం దొడ్డి కొమరయ్య అమర వీరుల జ్యోతి బహిరంగ సభను జయప్రదం చేయాలనికావున డిసెంబర్ 13వ తేదీన కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ లో జరుగు బహిరంగ సభలో అమరవీరుల జ్యోతిని అఖిల భారత నాయకత్వానికి అందిస్తామన్నారు.అదేవిధంగా 1936వ సంవత్సరంలో ఏర్పడిన అఖిలభారత కిసాన్ సభ జాతీయ ఉద్యమ వారసత్వాన్ని కొనుక్కు పుచ్చుకొని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జమీందారీ జాగేదారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడిందనినేడు వ్యవసాయ రంగంలో వస్తున్న సమస్యలపై సమశీలంగా పోరాడుతూనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పోరాడి విజయం సాధించిందనిస్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం రైతులు పెట్టిన సమగ్ర ఉత్పత్తి ఖర్చు 50% కలిపి మద్దతు ధరల చట్టం చేయాలనిరైతు రుణాల నీటిని ఏకకాలంలో మాకు చేయాలనిరుణ విమోచన చట్టం చేయాలనివిద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలనిరైతుల వ్యవసాయ కూలీలకు పెన్షన్ ఇవ్వాలనిపంట ఇన్సూరెన్స్ పథకాన్ని రైతులకు ఉపయోగపడే విధంగా మార్పు మార్చి రూపొందించాలనిఅటవీ సంరక్షణ చట్టానికి చేసిన సవరణ ఉపసంహరించుకోవాలనిపియం ప్రణం పథకాన్ని రద్దు చేయాలనిపాలు పాల ఉత్పత్తులపై విధించిన జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలనిభవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాలనిపిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బత్తిని వెంకన్న, రైతు రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ పోతిరెడ్డి లీనా రెడ్డి, తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షులు బిక్షపతి, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు దొడ్డి సురేష్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
జ్యోతి అఖిల భారత బస్సు యాత్రను జయప్రదం




