తెలంగాణ తొలి అమరవీరుడు కిష్టయ్య వర్ధంతి వేడుకలు :శామీర్ పేట్, జనం సాక్షి :
తెలంగాణ తొలి అమర వీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య 13 వ వర్ధంతి సందర్భంగా శామీర్ పేట లో కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బి ఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు తెలంగాణ ద్రోహుల కుట్రల వలన తెలంగాణ వచ్చుట ఆలస్యం అవుతుండటంతో తీవ్ర మనస్థాపానికి లోనై తన సర్వీస్ తుపాకీ తో నే కాల్చుకొని తనువు చాలించటం జరిగిందని అఫ్జల్ ఖాన్ తెలిపారు. అమరవీరుల త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అని,వారి కుటుంబాలను అని విదాల ఆదుకోవాలని అఫ్జల్ ఖాన్ కోరారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు కేసిఆర్ సేవాదళం మండల అధ్యక్షులు మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్, మేడ్చల్ జిల్లా కేసీఆర్ సేవాదళం కార్యదర్శి పి నర్సింహ రెడ్డి, బత్తిని చందర్, పి పోచయ్య,డి క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
1ఎస్పీటీ -4:నివాళులు అర్పిస్తున్న నాయకులు
తెలంగాణ తొలి అమరవీరుడు కిష్టయ్య వర్ధంతి వేడుకలు




