ఝరాసంగం లో టియల్ఎం మేళా
ఝరాసంగం జనవరి 3 (జనంసాక్షి) ఝరాసంగం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎఫ్ ఎల్ ఎన్ -తొలిమెట్టులో భాగంగా మండల స్థాయి టియల్ఎం -టీచింగ్,లెర్నింగ్ మెటీరియల్ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ ప్రారంభించడానికి విచ్చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన అభ్యసన సామాగ్రి విద్యార్థుల యొక్క సృజనాత్మకత ఆలోచనలకు ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు.విద్యార్థులు పాఠ్యంశాన్ని అర్ధవంతగా,వేగవంతగా ఎక్కువ రోజులు గుర్తు ఉంచుకునేలా చేయుటకు టి ఎల్ ఎం చాలా ఉపయోగపడుతాయని కోరారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్,నోడల్ ఆఫీసర్ పోచయ్య, ప్రధానోపాధ్యాయులు రత్నయ్య ఉపాధ్యాయులు రాంచందర్ భీంవశీ, అమృత్, ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
ఝరాసంగం లో టియల్ఎం మేళా




