హుజూర్ నగర్ ఏప్రిల్ 15 (జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణంలో టాటా ఏసీ వాహనాన్ని వెనుక నుండి లారీ అతివేగంగా ఢీకొట్టగా ఒకరు మృతిచెందగా మిగతా 14 మందికి గాయాలైనట్లు హుజూర్ నగర్ ఎస్ఐ కె. వెంకటరెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం సుమారు నెల రోజుల క్రితం నుండి బీహార్ రాష్ట్రానికి చెందిన 18 మంది కూలీలు హుజూర్ నగర్ పట్టణానికి చెందిన చల్ల లక్ష్మినారాయణ మెస్త్రి వద్ద హమాలీ కూలీ చేస్తున్నారు. శనివారం ఉదయం రామలక్ష్మిపురంలోని ఒక రైతు ధాన్యాన్ని కంటా వేయు నిమిత్తం, లింగగగిరి రోడ్ వైపున గల సంగు శ్రీను ఇంటి ముందు టిఎస్ 29 టిబి 4648 నెంబర్ గల టాటా ఏసీ ట్రాలీ ఆటోలో ఎక్కుచుండగా అంతలో లింగగిరి రోడ్ వైపు నుండి హుజూర్ నగర్ పట్టణం వైపుకు వస్తున్నా టిఎస్TS 07 టిఎఫ్ 8139 నెంబర్ గల లారీ డ్రైవర్ నుకాపంగు సురేష్ మద్యం సేవించి తన లారీనీ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుకుంటూ వచ్చి టాటా ఏసీ వాహనానికి టక్కర్ ఇవ్వగా ఎండీ.గుల్జార్ అలం తండ్రి ఎండీ. గుల్జార్ వయసు.35 సం.రాలు అక్కడిక్కడే మరణించగా, సఫిక్ , ఒబ్లా, రాజకపుర్, మోసం, తన్వీర్, డబ్లు, రొహిర్, సోను, మంజీర, చందన్ కుమార్, విహార్ సింగ్, సంసద్, మంజీర లకు రక్త గాయాలు అయినవి. మృతుని భావ షేక్. గాయసుద్దిన్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.




