Thursday, 5 November 2026

పట్టాల పంపిణీ.

 

 

 

 

 

మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్ 15.ప్రభుత్వ భూములలో నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి పట్టాలు ఇస్తామని, ఇచ్చిన మాట ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు.మల్కాజిగిరి సర్కిల్లో 58, 59 జీవో లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు తహసిల్దార్ కార్యాలయంలో కార్పొరేటర్లు మీనా ఉపేందర్ రెడ్డి, ప్రేమ్ కుమార్,సునీత యాదవ్ తో కలిసి పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వెంకటేశ్వర్లు,బిఆర్ఎస్ నాయకులు ఉపేందర్ రెడ్డి,చిందం శ్రీనివాస్,చిన్నారెడ్డి, ఉత్తమ్ రెడ్డి,ఎస్ ఆర్ ప్రసాద్,శివ,శోభ,కోటేశ్వరి,సతీష్ కుమార్, పిట్ల శ్రీనివాస్,గుండా నిరంజన్,మహేష్, యాది,సూరి,సత్తయ్య,సత్యనారాయణ, సంతోష్ రాందాస్,రఘు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.