Thursday, 5 November 2026

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులపై కక్ష సాధింపు మానుకోవాలిపీఆర్సీ పెంపుపై వివరణ ఇవ్వకపోతే అంధకారమే-మహబూబాబాద్ సర్కిల్ చైర్మన్ సాంభముర్తి

 

 

 

 

 

 

మహబూబాబాద్ బ్యూరో-ఏప్రిల్15(జనంసాక్షి)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు చేస్తుందని మహబూబాబాద్ సర్కిల్ చైర్మన్ కటకం సాంభముర్తి అన్నారు. పీఆర్సీ కమిటీ మార్చి2022నే ముగిసిన ఇప్పటివరకు ప్రభుత్వం దానిపై స్పష్టత ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు శ్రమిస్తున్న విద్యుత్ ఉద్యోగులను పట్టించుకోకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. కమిటీ ముగిసిననుండి ఇప్పటివరకు చర్చలు జరుపుతామని కళ్లబోల్లి మాటలతో కాలం వెల్లభుచుకుంటూ ఉద్యోగులతో ఆటలాడుతున్నారని ఆగ్రహించారు. వేతన సవరణ, ఆర్టిజన్ సమస్యలు, ఈపీఎఫ్,జిపిఎఫ్ 1999-2004 వంటి విద్యుత్ ఉద్యోగుల సమస్యలు తీర్చకపోతే రాష్ట్రం అంధకారం కాక తెగప్పదని ఆయన హెచ్చరించారు. ఈ నెల17 నుండి తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే నిరవధిక సమ్మెలో విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు, కార్మికులు, ఆర్టిజన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ఏడిఈ కిషోర్, కొకన్వీనర్ వెంకటేశ్వర్లు, నాయకులు ఆరిఫ్ ఉద్దీన్, మహేందర్ బాబు, సుధాకర్, రవి, సిరిపంగి నరేష్ తదితరులు పాల్గొన్నారు.