Tuesday, 3 November 2026

టాప్ టెన్ క్రిమినల్స్ లో ప్రధాని మోడీ!

ఢిల్లీ: టాప్ 10 క్రిమినల్స్ జాబితా చూస్తే.. అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఉన్నారా? గూగుల్ సెర్చిలో టాప్ 10 క్రిమినల్స్ అని వెతికితే.. అందులో నరేంద్రమోదీ ఫొటో కూడా వస్తోంది. ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం, అల్ జవహరి.. ఇలాంటి కరడుగట్టిన నేరస్థుల జాబితాలోనే ప్రధానమంత్రి ఫొటో కూడా పెట్టేశారు. సాంకేతికంగా ఏదో సమస్య వచ్చిందా.. లేక ఎవరైనా కావాలని ఇలా పెట్టారా అన్న విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే ఇది మాత్రం ఒక్కసారిగా సోషల్ మీడియాలో గగ్గోలు పుట్టిస్తోంది. ట్విట్టర్లో ఇప్పటికే దీనిమీద వందలకొద్దీ ట్వీట్లు వచ్చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ కూడా దీనిపై వ్యాఖ్యానించారు. తన దేశ ప్రధానమంత్రి పేరు టాప్ 10 క్రిమినల్స్ జాబితాలో ఉండటం ఒక భారతీయుడిగా తనకు సిగ్గుచేటని, ఇది జాతికే అవమానమని డిగ్గీరాజా ట్వీట్ చేశారు. సిగ్గుతో తల దించుకుంటున్నానని కూడా ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *