టాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్లో హాథిరాం నాయక్ కు గోల్డెన్ ఐకాన్ అవార్డు
టేకులపల్లి, నవంబర్ 21( జనం సాక్షి ): తెలుగు సినిమా 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్- 2022 గోల్డెన్ ఐకాన్ అవార్డుల ప్రధానోత్సవములో ఆదివారం హైదరాబాద్ లోని బంజారాహిల్స్, ఫిలిం ఛాంబర్ ప్రాంగణంలో సినీ రంగంతోపాటు వివిధ రంగాలలో సేవలు అందిస్తూ ఉన్నటువంటి వారిని గుర్తించి గోల్డెన్ ఐకాన్ అవార్డుల ప్రధానోత్సవం లో భాగంగా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన విద్యావంతుడైనటువంటి వాంకుడోత్ హాథిరాం నాయక్ బిల్లుడు తండాలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. హాథిరాం నాయక్ తెలంగాణ గిరిజన ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులుగా విధులు నిర్వహిస్తూ ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ న్యాయపరమైనటువంటి సమస్యలను తీరుస్తూ ఉద్యోగుల మన్ననలను పొందుతున్నారు. అంతేకాకుండా సామాజిక రంగంలోనూ ఎందరో పేద గిరిజన బడుగు బలహీన వర్గాలకు తన వంతు సహాయంగా వారికి అండగా నిలుస్తూ ఉంటున్న హాథిరాం నాయక్ ను ఫిల్మ్ ఇండస్ట్రీ తన విద్యారంగంలో, సామాజిక సేవారంగంలో చేస్తున్న సేవలను గుర్తించి టాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఆహ్వానించి తెలంగాణ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ చైర్మన్ “డాక్టర్ వకుళ భరణం కృష్ణ మోహన్ “, సినీ దర్శకుడు రంజిత్ , ప్రముఖ నిర్మాత ప్రభాకర్ , సినీ హీరో కార్తీక్, శ్రీరామ్, సినీ ఆర్టిస్టుల చేతుల మీదుగా మెమొంటో, ప్రశంస పత్రం, శాలువాతో, అభినందించి అవార్డుతో సత్కరించారు.




