Wednesday, 4 November 2026

టిఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి మంత్రి హరీష్ రావు

టిఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి మంత్రి హరీష్ రావు
నాంపల్లి నవంబర్ 1 (జనం సాక్షి ) మునుగోడు ఉప ఎన్నికల్లో సిపిఐ సిపిఎం బలపరిచిన టిఆర్ఎస్ అభ్యర్థి కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని మంత్రి తన్నీరు హరీష్ రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి అంగడి బజార్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్టు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. భగీరథ మిషన్ ద్వారా ఇంటింటికీ కృష్ణానది జలాలను అందించరానిన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తామని స్పష్టత చేశారు. 18 వేల కోట్లకు అమ్ముడు పోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గం ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. దేశంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డాక గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్యులను నడ్డి విరుస్తున్నారని మనిపడ్డారు. బోర్ బావులకు మీటర్లు పెట్టమని బిజెపి ప్రభుత్వం చెప్పితే రైతులు ఇబ్బంది పడతారని సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదన్నారు. మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్, జెడ్పిటిసి వేలుగోటి వెంకటేశ్వర రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్, కుంభం కృష్ణారెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్ ఏడు దొడ్ల రవీందర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గుమ్మడపు నరసింహారావు, కమిశేటి పాండు, గౌరీ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.