యాదాద్రి బ్యూరో జనం సాక్షి (జూన్ 2 )శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు .వివరాల్లోకెళ్తే ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆత్మకూరు మండలంలో ఏర్పాటుచేసిన టిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయబడుతుందని అన్నారు . 2014 నుండి 2023 వరకు ప్రభుత్వం ఎన్నో మార్పు తీసుకొచ్చింది తెలంగాణ రాకముందు ఎండాకాలంలో బోర్లు వెళ్ళిపోయి త్రాగడానికి నీటి వసతులు లేకుండా ఉండేదని వారు అన్నారు ఇప్పుడు కాలేశ్వరం ద్వారా చెరువులు నింపి కాల్వ ద్వారా వివిధ ప్రాంతాలకు కాలుల ద్వారా నీటిని నిలువ చేస్తున్నామని వారు అన్నారు నాడు 2600 ఎకరాలకు సాగునీరు అందిస్తే నేడు ఒక లక్ష 16 వేల ఎకరాల్లో పండ్లు పండిస్తున్నారని వారు అన్నారు. గ్రామ ,గ్రామాన సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణము, సోలార్ లైట్లు, వితంతు, వికలాంగుల, ఒంటరి మహిళ, గీత కార్మికు, చేనేత వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు అన్ని విధాలుగా ఆదుకున్నామని అన్నారు . ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గం అన్ని మండలాల్లో దళిత బంధువు ఇప్పిచ్చానని ఈ సందర్భంగా పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్సీడాక్టర్ యాదవ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి డి సి బి సి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ యాదగిరిగుట్ట జడ్పిటిసి తోటకూరి అనురాధ ఆత్మకూర్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బీసు చంద్ర గౌడ్ ఆత్మకూర్ పట్టణ అధ్యక్షుడు కుర్ర వేణు కుమార్ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు లగ్గాని రమేష్ గౌడ్ వివిధ గ్రామాల సర్పంచులు గ్రామ శాఖ అధ్యక్షులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు




