Tuesday, 3 November 2026

పంచాయతీ సిబ్బందికి ఏకరూప దుస్తుల పంపిణీ

బోయినపల్లి జూన్ 02 (జనం సాక్షి)
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు పంచాయతీ సిబ్బందికి గ్రామ సర్పంచ్ గుంటి లతా శ్రీ శంకర్ కార్యదర్శి రాజ సులోచన సిబ్బందికి ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు అనంతరం సర్పంచ్ లతా శ్రీ మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సిబ్బందికి ఏకరూప దుస్తులు అందజేయడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటును తర్వాత ప్రతి ఒక్క ఉద్యోగికి ప్రభుత్వం తగిన వేతనం కల్పిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి పథంలో సస్యశ్యామలంగా దేశంలోనే నెంబర్ వన్ గా కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లతా శ్రీ శంకర్ కార్యదర్శి రాజ సులోచన వార్డు సభ్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు