టిఆర్‌ఎస్‌లోకి మాజీమంత్రి మోత్కుపల్లి
18న ముహూర్తం కుదరినట్లు సమాచారం
హైదరాబాద్,అక్టోబర్16(జనంసాక్షి ): మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు. సోమవారం 18న మధ్యాహ్నం 2 గంటలకు ఆయన పార్టీలో చేరబోతున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖరారైనట్లు తెలిపారు. తెలంగాణ భవన్‌లో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. కేసీఆర్ చేతుల విూదకు గులాబీ కండువా కప్పుకోను న్నారు. మోత్కుపల్లి గతంలో సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేశారు. టీడీపీ తరఫున అప్పటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదేండ్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించారు. మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. అనంతరం టీడీపీ నుంచి బయటికి వచ్చిన మోత్కుపల్లి బిజెపిలో చేరారు. తాజాగా టీఆర్‌ఎస్ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల సిఎం కెసిఆర్ దళితబంధుకు మద్దతు పలికారు. ఆ తరవాత బిజెపిని వీడి కెసిఆర్‌కు మద్దతు పలికారు.