Thursday, 5 November 2026

టిక్కెట్లు దక్కని ఓయూ జెఎసి నేతలు

ధర్మపురి టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ దరువు ఎల్లన్న

హైదరాబాద్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ అధిష్టానంపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఆగ్రహం పెల్లుబికుతోంది. రెండో జాబితాలోనూ ఓయూ జేఏసీ నాయకుల పేర్లు లేకపోవడంతో విద్యార్థులు అసహననానికి గురవుతున్నారు. గతంలో ఓయూ నేతలకు టిక్కటెల్‌ఉ ఇస్తామని ఆశ చూపిన కాంగ్రెస్‌, రెండో జాబితాలోనూ మొండి చేయి చూపింది. ఇందులో ధర్మపురి(ఎస్సీ) స్థానాన్ని ఆశించిన దరువు ఎల్లన్నకు నిరాశే ఎదురైంది. ధర్మపురి టికెట్‌ను తనకు కాకుండా మరొకరికి కేటాయించడంపై దరువు ఎల్లన్న తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ధర్మపురిలో ధర్మం గెలువలేదని ఎల్లన్న మండిపడ్డారు. త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేశారు. ధర్మపురి స్థానాన్ని ఆడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌కు కేటాయిస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ రెండో జాబితాలో ప్రకటించింది. ఓయూ జేఏసీ నేతలైన దరువు ఎల్లన్న(ధర్మపురి), మానవతారాయ్‌(స్టేషన్‌ ఘన్‌పూర్‌), కేతూరి వెంకటేశ్‌(కొల్లాపూర్‌), దుర్గం భాస్కర్‌(బెల్లంపల్లి), లోకేష్‌ యాదవ్‌(ఖమ్మం), బాలలక్ష్మి(జనగాం), చరణ్‌(ఉప్పల్‌), రాజారాం యాదవ్‌(ఆర్మూర్‌) టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరెవరికి టిక్కెట్లు దక్కలేదు.