Saturday, 7 November 2026

మున్సిపాలిటీల అభివృద్ధికి వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేయాలి

మున్సిపాలిటీల అభివృద్ధికి వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేయాలి.
– తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కౌన్సిల్ ఫోరం రాష్ట్ర చైర్మన్ రాములు నాయక్.
బెల్లంపల్లి, నవంబర్ 27, (జనంసాక్షి )
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి వెయ్యి కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించి అన్ని వార్డులను అభివృద్ధి చేయాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కౌన్సిల్ ఫోరం రాష్ట్ర చైర్మన్ రాములు నాయక్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తున్న కార్పొరేటర్లకు, కౌన్సిలర్లకు, ₹ 5000 రూపాయల పింఛను మరియు చైర్మన్ లకు, మేయర్లకు ₹ 10000 రూపాయల పింఛను తో పాటు కార్పొరేట్ స్థాయిలో వైద్య సదుపాయం కల్పించాలని, మహిళా కార్పొరేటర్లకు, కౌన్సిలర్లకు స్కూటీ వాహనాలు మంజూరు చేయాలని, పట్టణ ప్రగతి ద్వారా మంజూరైన నిధులలో 50% మున్సిపాలిటీ వార్డులో అంతర్గత రోడ్లు డ్రైనేజీలు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని,
ప్రతి సంవత్సరం ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు మంజూరు చేయాలని, హైదరాబాదు నగరంలో, నూతనంగా మున్సిపల్ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేయాలని, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ 2019 చట్టాన్ని సవరణ చేసి, మున్సిపల్ కౌన్సిల్ కి అధికారం కల్పించాలని, కౌన్సిల్ సభ్యులకు 15 వేల రూపాయలు గౌరవ వేతనం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా శ్రీధర్, మున్సిపల్ ఫోరం రాష్ట్ర వైస్ చైర్మన్ కొక్కెర చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.