టిడిపిని దెబ్బతీయడమే బిజెపి లక్ష్యంగా ఉంది: డొక్కా

అమరావతి,జూలై17(జ‌నం సాక్షి): అబద్ధాలతో ప్రజలను ఎలా నమ్మించాలనే విషయమై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు కన్నా లక్ష్మీనారాయణ మెమోరాండం రూపంలో ఇచ్చారని టీడీపీ నేత డొక్కా మాణిక్యవర ప్రసాద్‌ విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవని చూపడానికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మంగళవారం ఇక్కడ విూడియాతో మాట్లాడిన ఆయన.. దళితులు, కార్మికులపై బీజేపీ నేతలే దాడులు చేసి ఇతరులపై రుద్దుతున్నారని ఆరోపించారు. నేరస్తులను సత్కరించడం బీజేపీకి అలవాటుగా మారిందని డొక్కా విమర్శించారు. దళితులకు వీరి ఏలుబడిలో రక్షణ లేదన్నారు. ఎపిలో టిడిపిని దోషిగా చేయాలన్న లక్ష్యంతో బిజెపి పావులు కదుపుతోందన్నారు.

 

తాజావార్తలు