Wednesday, 4 November 2026

టిపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అతిముఖ్య మైన పాత్ర వహించాలి : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి

 

 

 

 

 

వికారాబాద్ రూరల్ ఏప్రిల్ 8 జనం సాక్షిటిపిసిసి సోషల్ మీడియా కోఆర్డినేటర్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అతి ముఖ్యమైన పాత్ర వహించాలని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు శనివారం గాంధీ భవన్ లోని సోషల్ మీడియా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారల ఇంచార్జ్ మాణిక్ రావ్ థాక్రె మరియు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ముఖ్య అతిధులుగా తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ మన్నే. సతీష్ అధ్యక్షతన సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శుల సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది..ఈ సందర్బంగా సోషల్ మీడియా కోఆర్డినేటర్ల పనితీరుపై చర్చించారు. అదేవిదంగా రానున్న ఎన్నికల్లో రచించాల్సిన వ్యూహలపై సుదీర్ఘచర్చలు జరిపారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి చామల. రఘుపతి రెడ్డి పాల్గొన్నారు