Wednesday, 4 November 2026

టి టిడిపి నియోజకవర్గ కోఆర్డినేటర్ గా మండవ వెంకటేశ్వర్లు గౌడ్

 

 

 

 

హుజూర్ నగర్ ఏప్రిల్ 8 (జనంసాక్షి): తెలంగాణ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా మండల వెంకటేశ్వర్లు గౌడ్ నూతనంగా నియమితులయ్యారు. శనివారం పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ తెలంగాణలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, పేదలకు సంక్షేమ పథకాలు అందించి అభివృద్ధి అంటే తెలుగుదేశం అనే విధంగా పని చేసిందన్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం అందించడం, పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేయడం, జనత వస్త్రాలను అందించడం, తక్కువ ధరకే విద్యుత్ హార్స్ పవర్ అందించడం , పేదలకు పక్కా భవనాలు నిర్వహించడం లాంటి ప్రజా రంజకమైన పరిపాలన అందించి తెలంగాణ అభివృద్ధిలో తెలుగుదేశం కీలకపాత్ర పోషించిన విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో హైదరాబాదు సికింద్రాబాద్ మహా నగరాలకు దీటుగా సైబరాబాద్ మహానగరాన్ని నిర్మించి తెలంగాణలో 60 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచి రావడానికి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కారణమన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ కార్యకర్తలు పూలమాలతో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ పట్టణ పార్టీ కన్వీనర్ కొమ్మ గాని వెంకటేశ్వర్లు గౌడ్, గరిడేపల్లి మండల పార్టీ అధ్యక్షులు కేసరి నాగయ్య ముదిరాజ్, మఠంపల్లి మండల పార్టీ అధ్యక్షులు మాలోత్ నాగు నాయక్, టిఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోష పతి , నేరేడుచర్ల మండల పార్టీ అధ్యక్షులు ఇంజమూరి వెంకటయ్య , హుజూర్ నగర్ మండల పార్టీ అధ్యక్షులు నేలపట్ల అంజయ్య గౌడ్ , చింతలపాలెం మండల పార్టీ అధ్యక్షులు తిరుమలగిరి గోవిందు, పాలకీరు మండల పార్టీ అధ్యక్షులు పొదిల్లా అమరయ్య , ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మీసాల సైదులు , బీసీ సెల్ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు గౌడ్, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి గుండేటి సతీష్ , మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎస్కే మస్తాన్ , తెలుగు యువత పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చల్లా వంశీ ,ఎస్సీ సెల్ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కస్తాల కనక రత్నం , ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చింత వెంకటేశ్వర్లు , తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ మేకల రామారావు యాదవ్ , మాజీ పిఎసిఎస్ చైర్మన్ పంటా చిన్నకోటిరెడ్డి , తెలుగు యువత నాయకులు తురక గోపి, బ్రహ్మయ్య ,నరసింహారావు, నాగరాజు, నాగవెల్లి జాను , రామానుజం తదితరులు పాల్గొన్నారు.