జహీరాబాద్ ఏప్రిల్ 8 (జనంసాక్షి ) పట్టణంలో ని అల్లిపూర్ గార్డెన్ నగర్ సెంట్రల్ చర్చి ఆవరణలో శనివారం కిస్టియన్ సోదరులు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చర్చి అవరణం నుండి బయలు దేరిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగింది. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ,టీపీసీసీ నాయకులు నరోత్తం సెంట్రల్ చర్చి డిఎస్, పలువురు పాస్టర్ లు విశ్వాసులు, అధిక సంఖ్యలో పాల్గొని రన్ ఫర్ జీసస్ కరహాక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో సి వై జడ్ యూత్ అధ్యక్షుడు శివప్ప, నాయకులు రాజు కుమార్,స్టీవెన్,నవీన్ కుమార్, ఆనంద్, శివరాజ్, ఆయా గ్రామాల్లో ని యువత తదితరులు పాల్గొన్నారు.




