టిబిజికెఎస్ లో చేరికలు.
ఫొటో : యూనియన్ లోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే.
బెల్లంపల్లి, డిసెంబర్ 22, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణం లోని సింగరేణి ఏరియా ఆసుపత్రి సిబ్బంది గురువారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో అధికార టీబీజీకేఎస్ చేరారు. 17 మంది జనరల్ మజ్దూర్లు, వార్డు బాయ్ లు ఇతర సిబ్బందికి ఎమ్మెల్యే కండువా కప్పి యూనియన్ లోకి స్వాగతించారు. కార్మికుల సమస్యల పరిష్కారం ముఖ్యమంత్రి కెసిఆర్ తోనే సాధ్యమని భావించి యూనియన్ లో చేరారాని ఎమ్మెల్యే తెలిపారు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మల్రాజ్ శ్రీనివాస్ రావు, కేంద్ర నాయకుడు, 13వ వార్డు కౌన్సిలర్ గెల్లి రాజలింగు, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, వర్కింగ్ ప్రెసిడెంట్ నూనేటి సత్యనారాయణ, జీఎం కమిటీ మెంబర్ గజెల్లి చంద్రశేఖర్, ఏరియా ఆసుపత్రి ఫిట్ కార్యదర్శి అనుముల సత్యనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి చెవిటి సుదర్శన్, నాయకులు దార స్వరూప రాణి, సోకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
టిబిజికెఎస్ లో చేరికలు.




