Sunday, 8 November 2026

భారత ప్రజలసంక్షేమం కోసమే బి.అర్.ఎస్ పార్టీ.

భారత ప్రజలసంక్షేమం కోసమే బి.అర్.ఎస్ పార్టీ…

– రాష్ట్రంలో వలె దేశంలో సంక్షేమ పథకాలు తీసుకొస్తాం..

భైంసా రూరల్ డిసెంబర్ 22 జనం సాక్షి

 

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.

 

భారత ప్రజల సంక్షేమం కొరకు, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ దేశంలో అమలు అవ్వలని ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ బి.ఆర్.ఎస్ పార్టీని స్థాపించారని న్యాయ, దేవాదాయ,అటవీపర్యాటక శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.గురువారం మహారాష్ట్ర రాష్ట్రంలోని బోకర్ తాలూకా, కీని గ్రామంలో దాదాపు 500 మందితో బి.ఆర్.ఎస్ మొదటిసభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,ముధోల్ తాలూకా ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి అక్కడి మహారాష్ట్రప్రజలతో మాట్లాడుతూ… తెలంగాణరాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, రైతులకు ఉచితకరెంటు,కల్యాణలక్ష్మి షాదీముబారక్ లాంటి అనేక సంక్షేమ పథకాలు దేశంలో ప్రతి చోట అమలు అవ్వాలని సంకల్పంతో బిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందని, రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుండీ ఇక్కడ పోటిచేసే ఎమ్మెల్యే,ఎంపీ అభ్యర్థులను ప్రజలు ఎన్నుకొని సంక్షేమ పథకాలుసాధించుకోవాలన్నారు.కేంద్రంలో బిజెపి ఇప్పటికీ రైతులను పట్టించుకోవడం లేదంటూ తెలిపారు.గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ సభకి దాదాపు 500 మంది హాజరవ్వగా అక్కడిముఖ్య నాయకులు మంత్రి,ఎమ్మెల్యే చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకొని పార్టీలో జాయిన్ అయ్యారు.ఈ సభకి నిర్మల్ జిల్లా జడ్పీ చైర్మన్, జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్, సర్పంచులు,తెరాస ముఖ్య నాయకులు హాజరయ్యారు.