Sunday, 8 November 2026

శాంతిఖని గనిలో సేఫ్టీ కమిటీ పర్యటన.

శాంతిఖని గనిలో సేఫ్టీ కమిటీ పర్యటన.
ఫొటో : పర్యటించిన సేఫ్టీ కమిటీ సభ్యులు.
బెల్లంపల్లి, డిసెంబర్ 22, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గనిలో గురువారం గని రక్షణ కమిటీ సభ్యులు గనిని పరిశీలించారు. భూగర్భంలో బీఎం డిస్ట్రిక్ట్, బెల్ట్ దారులను పర్యవేక్షించారు. అనంతరం మీటింగ్ హాలులో సమావేశమై గనిలో రక్షణ కోసం తీసుకోవల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి ఆర్ విజయ ప్రసాద్, మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా, రక్షణ అధికారి పి రాజు, పిట్ ఇంజనీర్ రాంబాబు, ఇంజనీర్లు రాంసాగర్, ప్రవీణ్, టీబీజీకెఎస్ పిట్ సెక్రటరీ దాసరి శ్రీనివాస్, ఏఐటీయుసి పిట్ సెక్రటరీ దాసరి తిరుపతి గౌడ్, సేఫ్టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.