Tuesday, 3 November 2026

మేడే స్పూర్తితో శ్రమ దోపిడీపై ఉద్యమించాలిమేడే స్పూర్తితో శ్రమ దోపిడీపై ఉద్యమించాలి కులాలకు అతీతంగా జరుపుకునే పండుగ మే.. డే పండుగ 

 

 

 

 

 

 

దామెర మండలం 1 మే జనం సాక్షి ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా సోమవారం రోజున హనుమకొండ జిల్లా దామెర మండలం లో ఓగులాపురం శివారులో గుడిసెలా దగ్గర సిపిఐ  అరుణ పతాకాన్ని జిల్లా సమితి సభ్యులు కొట్టేపాక రవి ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్క కార్మికులు జరుపుకునే గొప్ప పండగ మే.. డే పండుగ అని అన్నారు.అంతేకాకుండా దేశ సంపదను తన కార్పొరేట్ మిత్రులకు మోడీ కట్టబెడుతున్నారని, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను రోడ్డున పడవేస్తున్నారని అన్నారు. కార్మికులు ఉద్యమించకుండా కార్మిక చట్టాలను సవరించి వారి హక్కులను కాలరాశారని అన్నారు. పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని కాపాడుకునేందుకు, కార్పొరేట్ శక్తుల శ్రమ దోపిడీని అరికట్టేందుకు కార్మిక వర్గం మేడే స్పూర్తితో ఉద్యమించాలని  కొట్టేపాక రవి అన్నారు. ఓగులాపూర్ శివారులో వెలిసిన గుడిసెల వాసులతో మాట్లాడారు వర్షాలకు ఇబ్బంది పడుతూ గుడిసెలలో జీవిస్తున్న ప్రజలను, వారి జీవనం. వారి ఆరోగ్యం, గురించి ప్రత్యేకంగా తెలుసుకున్నారు. పిడుగురాళ్ల పడ్డ నిరంతరం వర్షం వచ్చినా తిండి లేకుండా, గుడిసెల్లో జీవనం కొనసాగిస్తాం అని గుడిసె వాసులు తెలిపారని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు అంబి సాంబయ్య, రాజేష్, అఖిల, ప్రమీల, ఐలయ్య, భాస్కర్, కర్ణాకర్, దేవేందర్, సులోచన, రాధిక, అదేవిదంగా వందల మంది మండల కార్యకర్తలు, వేల సంఖ్యలో గుడిసె వాసులు, తదితరులు ఉన్నారు.