Thursday, 5 November 2026

టి ఎస్ టి టి ఎఫ్ జిల్లా శాఖ నూతన కమిటీ ఎన్నిక 

 

 

 

 

 

 

 

 

టేకులపల్లి, ఏప్రిల్ 15( జనం సాక్షి): టి ఎస్ టి టి ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ నూతన కమిటీని శుక్రవారం జరిగిన ఉమ్మడి జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు టి ఎస్ టి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ తెలిపారు. జిల్లా అధ్యక్షులుగా భూక్య శంకర్ నాయక్,ప్రధాన కార్యదర్శిగా వాంకుడోత్ రమేష్ బాబును ఎన్నిక చేశారు. జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో లక్ష్మణ్ నాయక్ హాజరై మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడిన అధ్యక్ష,కార్యదర్శులు  రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్నాయక్,లాకావత్ శర్మనాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గౌరవ అధ్యక్షులు మాలోతు శివ నాయక్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్ బానోతు వీరు నాయక్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.