Thursday, 5 November 2026

సోషల్ రెస్పాన్సిబిలిటీ టీమ్ ఆధ్వర్యంలో టీ.బి రోగులకు పౌష్టిక ఆహారం పంపిణీ

 

 

 

 

 

గద్వాల నడిగడ్డ, ఏప్రిల్ 15 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని అన్ని మండలాల్లో ఉన్నటువంటి టీబి పేషంట్లకు శనివారము ప్రభుత్వ ఆసుపత్రిలో సోషల్ రెస్పాన్సిబిలిటీ సభ్యులు పౌష్టికాహారం పంపిణీ చేశారు. అత్యంత నిరుపేదలైన వారికిపౌష్ఠిక ఆహారం అవసరమని మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసే సీనియర్ సూపర్వైజర్ శ్రీనివాసులు రిక్వెస్ట్ చేయడం తో వారికి అత్యంత అవసరమయ్యే పౌష్టికాహారాన్ని ఆరు నెలలకు సరిపోయే విధంగా 20 మందికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆధ్వర్యంలో సుమారు 60,000/- రూపాయల విలువ గలవి ప్రతి మనిషికి 6 కిలోల బెల్లం, 6 లీటర్ల సన్ ఫ్లవర్ నూనె ,6 కిలోల కందిపప్పు,డ్రై ఫ్రూట్స్ 6 కిలోల పల్లీలు మొదలగునవి సోషల్
రెస్పాన్సిబిలిటీ మెంబర్ డాక్టర్ శ్యామ్ చేతుల మీదుగా గద్వాల ప్రభుత్వ ఆస్పత్రి యందు పంపిణీ చేయడం జరిగిందని సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం సభ్యులు సంధ్య అశోక్, దేవేంద్ర ,నరసింహ, బెంజమిన్, ఈశ్వర్, శ్యామ్, శ్రీను, నగేష్, మురళి తదితరులు పాల్గొన్నారు.