Thursday, 5 November 2026

బలగం సుధాకర్ రెడ్డి కి సన్మానం – నగదు ప్రోత్సాహం

 

 

 

 

 

జనం సాక్షి(హుజూరాబాద్): హుజూరాబాద్ లో శనివారం స్థానిక నిర్వాణ రెస్టారెంట్ ఆధ్వర్యం లో బలగం సినిమా లో కొమురయ్య గా నటించి ,  మెప్పించి , అందరి హృదయాలను గెలుచుకున్న కేతిరి సుధాకర్ రెడ్డి ని హుజురాబాద్ కు చెందిన శ్రీ సరస్వతీ శిశుమందిర్ 1984 సెవంత్ క్లాస్ బ్యాచ్  పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. శాలువాతో సన్మానించి , మెమంటో తో పాటు డెబ్భై వేల నూట పదహారు రూపాయల నగదు  అందచేసారు.సుధాకర్ రెడ్డి  సినిమారంగంలో  మంచి పాత్రలు వేసి ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మంచికట్ల భాస్కర్ , సందసాని నరేష్ , కేతిరి ప్రదీప్ రెడ్డి ,  కొమురవెళ్లి చెన్నస్వామి , మంచికట్ల సంపత్ ,  పొన్నోజు మనోహర్  , పెద్దిప్యాట దామోదర్ , మద్దూరి నిరంజన్ , ముల్కనూరు రవిందర్ మరియు కళ్లెపు సుధాకర్ రావ్ , మంచికట్ల వెంకటయ్య , చందా గాంధీ తదితరులు పాల్గొన్నారు.