Wednesday, 4 November 2026

పాఠశాల ఆవరణలో పూర్వ ప్రాథమిక స్థాయి మరియు ప్రాథమిక స్థాయి విద్యార్థిని విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే ను నిర్వహించారు

 

 

 

 

జనం సాక్షి:- కృష్ణవేణి ఉన్నత పాఠశాల భాగ్యనగర్ కాలనీ షాద్నగర్ నందు నేడు  ఇందులో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి రఫత్ సుల్తానా గారు యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ ను బహూకరించారు . యూకేజీ విద్యార్థులు వారు పూర్వ ప్రాథమిక స్థాయిని పూర్తిచేసుకుని ప్రాథమిక స్థాయిలోకి అటవీడుతున్న సందర్భంగా వారికి అభినందనలు తెలియజేశారు అదేవిధంగా ప్రాథమిక స్థాయి లోని 5వ తరగతి విద్యార్థుల విద్యార్థులు ఉన్నత సాయి విద్యాబాసంలోకి అడిగెడుతున్న సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ 5వ తరగతి విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు ఇందులో భాగంగా ప్రముఖ వక్త ప్రభుత్వ కాలేజ్ బీఈడీ ఉపన్యాసకులు శ్రీ మందుముల రాధాకృష్ణ రావు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. శ్రీ రాధ కృష్ణ గారు మాట్లాడుతూ విద్యార్థులు పాఠ శాల స్థాయి నుండి మంచి అలవాట్లను అలవర్చుకోవాలని వారికి తమ అమ్మానాన్నలు ఎంతో ఆలోచనతో నిర్ణయించిన పేరు ను కాపాడాలని వారిపట్ల ఎల్లప్పుడూ విధేయంగా వుంటూ పాఠశాల లో వినయంగా వుంటూ ఉపాధ్యాయులకు పాఠశాలకు మంచిపేరు తేవాలని numerology పరంగా విధ్యార్తుల పేరును సంఖ్యాశాస్త్రం కు అనుసంధానం చేస్తూ వాటి ప్రాముఖ్యతను తెలియ పరుస్తూ విద్యార్థులను ఉద్దేశించి ఎంతో ప్రోత్సాహకంగా మాట్లాడారు.పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి రఫత్ సుల్తానా గారు గ్రాడ్యుయేషన్ డే ప్రాముఖ్యత ను వివరిస్తూ గ్రాడ్యుయేషన్ డే అనేది విద్యార్థుల కోసం సంవత్సరాల కృషి మరియు అంకితభావానికి పరాకాష్టగా సూచించే ఒక స్మారక సందర్భం. తమ ఆత్మీయులు మరియు తోటివారితో చుట్టుముట్టబడిన వారి విజయాల గర్వంతో వారు మునిగిపోయే రోజు ఇది. గ్రాడ్యుయేషన్ వేడుక అనేది కేవలం లాంఛనప్రాయమైనది కాదు, కానీ వారి విద్యాపరమైన విజయాల వేడుక మరియు వారి సంకల్పానికి నిదర్శనం. విద్యార్థులు తమ ప్రయాణం మరియు ఈ స్థాయికి చేరుకోవడానికి వారు అధిగమించిన సవాళ్లను ప్రతిబింబించే అవకాశం ఇది. అని తెలియ పరచారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు చెందిన వివిధ వివిధ తరగతుల విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో చూపరులను ఆకట్టుకున్నారు మరియు పూర్వ ప్రాథమిక స్థాయి ప్రాథమిక స్థాయి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఆనందోత్సవాలకు లోనయ్యారు.కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉాధ్యాయులు పాల్గొన్నారు