Saturday, 7 November 2026

టి.యల్.యం మేళాలను వాయిదా వేయాలి

టి.యల్.యం మేళాలను వాయిదా వేయాలి
* టీఎస్ యుటిఎఫ్ డిమాండ్

టేకులపల్లి, డిసెంబర్ 23 (జనం సాక్షి ): డిసెంబర్ నెలలో నిర్వహించనున్న టి.యల్.యం మేళాలను వరుస సెలవుల నేపథ్యంలో వాయిదా వేసి , జనవరి నెలలో సంక్రాంతి సెలవుల తర్వాత ఏర్పాటు చేయాలని టీఎస్ యుటిఎఫ్ భద్రాద్రి జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు బి.కిశోర్ సింగ్, నంది కృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో అధికారులను కోరారు.డిసెంబర్ నెలలో వరుసగా మూడు రోజులు క్రిస్మస్‌ సెలవులు కావడంతో పని దినాలు తక్కువగా ఉన్నాయి.ఉపాధ్యాయులు కనీసం నాలుగు టి.యల్.యంలను తయారు చేసి ప్రదర్శించాలన్నా, ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లోని ఏకోపాధ్యాయులకు కష్టతరమైన పని అయినందున, కొంత వ్యవధి ఇచ్చి,సంక్రాంతి సెలవుల తర్వాత ఈ మేళాలు నిర్వహిస్తే ఉపయోగకరంగా ఉంటుందని, అందుచేత టి ఎల్ ఎం మేళాలను వాయిదా వేయాలని ఆర్ డిమాండ్ చేశారు.