Saturday, 7 November 2026

టేకులపల్లిలో ఘనంగా జాతీయ రైతులు దినోత్సవం

టేకులపల్లిలో ఘనంగా జాతీయ రైతులు దినోత్సవం
* ఫర్టిలైజర్ పెస్టిసైడ్ సీడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైతులకు సన్మానం

టేకులపల్లి, డిసెంబర్ 23( జనం సాక్షి ): జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా టేకులపల్లి మండల కేంద్రంలో రైతులను ఘనంగా సన్మానించారు. శుక్రవారం మండల కేంద్రంలో ఫర్టిలైజర్, పెస్టిసైడ్, సీడ్స్ డీలర్స్ అసోసియేషన్ టేకులపల్లి ఆధ్వర్యంలో రైతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రైతులను పూలమాలలతో, శాలువాలు కప్పి సన్మానించిన కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు బోడాబాలునాయక్ ,కోశాధికారి నరసింహారావు, జిల్లా అసోసియేషన్ సభ్యులు నాగయ్య లు మాట్లాడుతూ దేశానికి వెన్నెముకైనా రైతులను సన్మానించుకోవడం ఎంతో అభినందనీయమన్నారు. సన్మాన గ్రహీత రైతులు వడ్డే అంజయ్య, బానోతు ఊక్లా నాయక్, రాస మల్ల నరసయ్య, చిర్రా వెంకటయ్య, మూతి కృష్ణ, బండారి శ్రీను, మీసాల రాముల ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ బాలకృష్ణ , గుడిపూడి సత్యనారాయణ, గుడిపూడి మోహన్ రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భూక్య దేవ నాయక్ ,ఇస్లావత్ మాంగ్య , వాంకుడోత్ పుణ్య, మూడు బాలు, ధరావత్ బిక్షం తదితరులు పాల్గొన్నారు.