Thursday, 5 November 2026

టి.యు.డబ్ల్యూ.జె యూనియన్ సభ్యులకు ఘనంగా సన్మానం

టి.యు.డబ్ల్యూ.జె యూనియన్ సభ్యులకు ఘనంగా సన్మానం
ఝరా సంగం జనవరి 11 (జనం సాక్షి)
ఝరాసంగం మండల కేంద్రంలో ఝరసంగం మండల జర్నలిస్ట్ ల ఆధ్వర్యంలో టీ.యు.డబ్ల్యూ.జె -ఐ.జె.యు సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు సిద్ధన్న పటేల్, జహీరాబాద్ నూతన అధ్యక్షుడు మీనాజ్, ఉపాధ్యక్షులు మాణిక్ పటేల్,రాజేష్,ఎంపీ సంతోష్ పటేల్, సహాయ కార్యదర్శి సిహెచ్ మహేష్, సభ్యులు సోమయ్య స్వామి ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు బుధవారం ఝరాసంగం మండల జర్నలిస్టులు ఎంపీడీవో కార్యాలయంలో సమావేశ మందిరంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ లు సుధాకర్, సుధాకర్ రెడ్డి, అనిల్ కుమార్,రాజ్ శేఖర్, చిరంజీవి, సంగమేశ్వర్, రబ్బాని తదితరులు పాల్గొన్నారు.