Thursday, 5 November 2026

వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశాన్ని బహిష్కరించిన సభ్యులు

వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశాన్ని బహిష్కరించిన సభ్యులు

రాయికొడ్ జనం సాక్షి జనవరి 11 రాయికొడ్.మండల పరిధిలోని మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశాన్ని సభ్యులు బహిష్కరించారు.బుధవారం జరిగిన మార్కెట్ కమిటీ సమావేశంలో సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు.గత సమావేశాల్లో తీర్మానించిన అంశాలకు ఆమోదించినా,ఆ అంశాల తాలూకు పనులు మంజూరైన పనులు కావడంపై, ఛైర్మన్ ఒంటెత్తు పోకడలకు నిరసనగా, ఛైర్మన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు న్న తీరు పట్ల వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు . నిధులు మంజూరు అయిన కూడా టెండర్ల వద్ద ఆగిపోవడం జరిగిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.మార్కెట్ కమిటీ సమావేశను అందరి అభిప్రాయం మేరకు సమావేశాన్ని బహిష్కరించారు. ఛైర్మన్ జోగు నవనీత అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. గతం లో తీర్మానం చేసిన మంజూరైన పనులు ఎందుకు పనులు చేయలేదో చైర్మన్ చెప్పాలని సభ్యులు చైర్మన్ ను నిలదీశారు.సమా వేశంలో హాజరైన సభ్యులు ఒక్క సారిగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పనులకు నిధులు మంజూరు చేసే వరకు సభను బహిష్కరిస్తున్నట్లు చెప్పి, వారు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు ఈ కార్యక్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్ కమిటి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు