150 మీ జాతీయ జండా ప్రదర్శన
ఫోటో రైటప్, 26 బీడీఎన్, బారీ జండాతో విద్యార్థులు
బోధన్, జూలై 26 ( జనంసాక్షి ) : బోధన్ పట్టణంలో మంగళవారం టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ సందర్బంగా 150 మీటర్ల జాతీయ జెండాతో విజేత జూనియర్ కాలేజీ నుండి అంబేద్కర్ చౌరస్తా, పోస్టు ఆఫీస్, రెంజల్ బేస్ మీదుగా శక్కర్ నగర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీఆర్ఎస్వీ అధ్యక్షులు వడ్ల సతీష్ చారి మాట్లాడుతూ, మన దేశంలో కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ సైనికుల నుండి దేశ రక్షణ కోసం 80 రోజులు పోరాడి కార్గిల్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే సమయంలో ప్రాణత్యాగం చేసిన 527 మంది అమర జవానులకి నివాళులు అర్పించడం ప్రతీ భారతీయుడి బాధ్యత అని అన్నారు. యువత దేశ రక్షణ కోసం ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి షైక్ ఆరిఫ్, ధనుష్, ఆఫనాన్, ధనుష్, రితిష్, విద్యార్థులు పాల్గొన్నారు.




