భారత రాష్ట్రసమితి ఆవిర్భావ సభకు భారీ గా తరలిరావాలి
రఘునాథ పాలెం జనవరి 13 జనం సాక్షి
జనసమికరణలో భాగంగా పాపటపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ దగ్గర ముఖ్య కార్యకర్తల సమావేశం వేర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రఘునాథపాలెం మండలం అధ్యక్షులు వీరు నాయక్ ఈ సమావేశానికి హాజరై కేసీఆర్ వేర్పాటు చేసే భారీ మీటింగ్ కు మన గ్రామంలో నుండి భారీగా జన సమీకరణ చేసి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ గుత్తా రవి పాపడపల్లి గ్రామ ఉపసర్పంచ్ ఉయ్యూరు వెంకటనారాయణ మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ బోయినపల్లి లక్ష్మణ్ గౌడ్ లాలు సైదులు భద్రయ్య రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు




