Monday, 2 November 2026

రేపటి నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం 

 

 

 

 

 

 

మక్తల్ మే 01 (జనంసాక్షి) వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు సంబంధించిన క్రీడా పరికరాలను మక్తల్ పట్టణానికి చెందిన పిఈటి లు అమ్రేష్, రమేష్ కుమార్ కు ఖో _ఖో కుసంబంధించిన క్రీడా పరికరాలను సోమవారము నారాయణపేట జిల్లా డివైస్ ఓ కార్యాలయంలో అధికారి కృష్ణమాచారి అందజేసినట్లు మక్తల్ వేసవి క్రీడా శిక్షణ శిబిరాల అడ్వైజర్ విశ్రాంత పిఈటి బి. గోపాలం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ఈనెల 2వ తేదీన మక్తల్ మినీ స్టేడియంలో ప్రారంభిచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణపేట జిల్లా డివైస్ ఓ. కృష్ణమాచారి ముఖ్య అతిథిగా హాజరై వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ప్రారంభిస్తారని బి గోపాలం తెలిపారు. క్రీడా శిక్షణ శిబిరాలను కోచులు అమ్రేష్, రమేష్ కుమార్ ఆధ్వర్యంలో 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు శిక్షణ ఇస్తారని తెలిపారు. మక్తల్ పరిసరప్రాంతాలలోని బాల బాలికలు సద్వినియోగం చేసుకొని క్రీడలలో మేరుగైన శిక్షణ పొందాలని అన్నారు. క్రీడా శిక్షణ శిబిరాలలో వివిధ క్రీడలలో బాల బాలికలకు 30 రోజుల పాటు శిక్షణ ఇచ్చి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలకు పంపించడం జరిగిందన్నారు. అనంతరం శిక్షణ పొందిన బాలబాలికలకు కలెక్టర్ ద్వారా ప్రశంసా పత్రాలు అందజేస్తారని తెలిపారు.