– తెలంగాణ వ్యతిరేకి జగన్‌కు కేసీఆర్ ఎలా సహకరిస్తారు?
– ఓటర్ వేలికి ఇంక్ ఆరకముందే పార్టీలు పిరాయించడం దారుణం
– టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చంద్రశేఖరరెడ్డి
హైదరాబాద్, మే5(జనంసాక్షి) : తెలంగాణ వ్యతిరేకి జగన్, ఆయన దొంగ అని విమర్శించిన టీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు జగన్‌ను గెలిపించేందుకు తాపత్రయ పడుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఎన్డీఆర్ భవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. జగన్‌ను సీఎంని చేయాలనే తపన టీఆర్‌ఎస్‌కు ఎందుకుని.. తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ కొడుకుపై టీఆర్‌ఎస్‌కు ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ఎందుకు స్టాండ్ మార్చుకుందని, లోటస్‌పాండ్‌కు వెళ్లి జగన్‌తో లంచ్ చేసేంత సాన్నిహిత్యం కేటీఆర్‌కి ఎక్కడిదని ప్రశ్నించారు. ఫిరాయింపులకు బ్రేక్ పడాలన్న రావుల.. ఓటర్ వేలికి ఇంక్ ఆరక ముందే ఎమ్మెల్యేలు పార్టీలు మారడం దారుణమని అన్నారు. ఇప్పుడు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్న తలసాని శ్రీనివాస్‌యాదవ్.. టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్‌పైనా ఇలానే విమర్శలు చేసేవారని గుర్తుచేశారు. జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయితే తెలంగాణకు ఇబ్బందులు తప్పవని.. జగన్‌కు జై కొడితే అవినీతికి జై కొట్టినట్టేనని రావుల అభిప్రాయపడ్డారు.
తెలుగుదేశం పార్టీపై తెలంగాణ సీఎం కేసీఆర్ కక్షకట్టారని విమర్శించారు. తెలంగాణ వ్యతిరేకి జగన్‌కు కేసీఆర్ ఎలా సహకరిస్తారని ప్రశ్నించారు. జగన్ అవినీతిపై గతంలో టీఆర్‌ఎస్ ఎంపీ కవిత ప్రెస్‌విూట్ పెట్టి మాట్లాడలేదా అని రావుల ప్రశ్నించారు. కేటీఆర్ కూడా జగన్ అవినీతిపై బహిరంగ లేఖ రాశారన్నారు. జగన్‌కు వ్యతిరేకంగా పవన్, కవిత ఉపన్యాసాలు ఇచ్చారని, అలాంటిది ఇప్పుడు జగన్‌పై కేసీఆర్, కేటీఆర్‌కు ఎందుకు అంత ప్రేమ పుట్టిందని రావుల ప్రశ్నంచారు. డేటా కేసులో చేస్తున్న హడావిడి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కి దెబ్బఅని రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఇప్పటికే పిల్లచేష్టలను తెలంగాణ ప్రభుత్వం మానుకోవాలని , లేకుంటే ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
టీఆర్‌ఎస్ ఎందుకు స్టాండ్ మార్చుకుంది..?




