టీఎస్ డబ్ల్యూ ఆర్ డి సి జగద్గిరిగుట్ట కళాశాలలో షీ టీం (షామీర్పేట్) ద్వారా సైబర్ నేరాల పై అవగాహన :శామీర్ పేట్, జనం సాక్షి :
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల జగద్గిరిగుట్ట (శామీర్పేట్) కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇష్రత్ ఆధ్వర్యంలో షీ టీం ద్వారా సైబర్ నేరాల గురించి మహిళ పోలీస్ లు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల గురించి వివరిస్తూ విద్యార్థులకు మొబైల్ లింక్స్ ఓపెన్ చేయవద్దని, విద్యార్థులపై వేధింపులు, అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరిల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా ప్రాబ్లం వస్తే పోలీసులను సంప్రదించాలని ఉదాహరణగా కొన్ని కేసుల గురించి వివరించి చెప్పారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
30ఎస్పీటీ -1: విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు
టీఎస్ డబ్ల్యూ ఆర్ డి సి జగద్గిరిగుట్ట కళాశాలలో షీ టీం (షామీర్పేట్) ద్వారా సైబర్ నేరాల పై అవగాహన




