వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావును కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి కొండమల్లేపల్లి డిసెంబర్ 30 జనం సాక్షి న్యూస్ : పట్టణ కేంద్రంలో శుక్రవారం నాడు కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మెరుగైన వసతులు, ప్రజలకు అందుబాటులో ఉండే అన్ని రకాల వైద్య పరీక్షలు 24 గంటలు రోగులకు వైద్య సేవలు అందించాలని కొండమల్లేపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 24 గంటల వైద్య సదుపాయం కల్పిస్తూ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతన అదనపు గదులు నిర్మాణాన్ని మంజూరు చేస్తూ వెంటనే పనులు ప్రారంభించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 24 గంటల వైద్య సదుపాయం మరియు అదనపు గదుల మంజూరు నిర్మాణాన్ని మంత్రి హరీష్ రావును కలిసి సమస్యను వివరించిన వెనువెంటనే ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావును హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు సామాన్య ప్రజలు ఆర్థిక సమస్యతో ఇబ్బంది పడకుండా వేల లక్షల రూపాయలు అప్పుల పాలు కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ లో వెళ్లలేని, స్తోమత లేని సామాన్య ప్రజలు మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వినియోగించుకోవాలని కోరారు మండలంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల రోగులకు ప్రాథమిక చికిత్స చేయడంతో పాటు బీపీ షుగర్ డయాగ్నొస్టిక్ లాంటి వ్యాధులకు కూడా పి హెచ్ సి లో డాక్టర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు మండలంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో పరిశుభ్రమైన పరిసరాలలో అనుభవం ఉన్న వైద్యులు అందుబాటులో ఉంటారని ఇటువంటి అవకాశాన్ని సామాన్య ప్రజలు తప్పక వినియోగించుకోవాలని వారు కోరారు మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్ర అభివృద్ధికి సహకరించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తో పాటు దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ లను మండల ప్రజలందరి తరపున మా హృదయపూర్వక కృతజ్ఞతలు అని విలేకరుల సమావేశంలో తెలిపారు వీటితోపాటు మండలంలో అన్ని రకాల ఆరోగ్య సౌకర్యాలు ఉన్న ఒక అంబులెన్స్ కూడా మన మండలానికి వస్తే బాగుండేదని దీని ద్వారా ఎమర్జెన్సీ సమయంలో మనుషుల ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు వీటితోపాటు మండలంలోని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ జగన్ నాయక్, ఉప సర్పంచ్ మంగ్యా నాయక్, యేకుల సురేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కందుల వెంకట్ రెడ్డి, వరికుప్పల శ్రీనివాస్, అందుగుల లింగయ్య, ఎండి ఖదీర్, సేవా నాయక్, రమేష్ నాయక్, పంగ శివ తదితరులు పాల్గొన్నారు
వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావును కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన కొండమల్లేపల్లి ఎంపీపీ




