పార్టీ బలోపేతంకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి
వీణవంక డిసెంబర్ 30 (జనం సాక్షి) వీణవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం టి పి సి సి సభ్యులు కర్ర భగవాన్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు వీణవంక మండల సమన్వయ కర్తలు వన్నె రాజ మల్లయ్య, కల్వల రామచందర్ లు ముఖ్యఅతిథిగా హాజరై వీణవంక మండలంలోని అన్ని గ్రామాల గ్రామ కమిటీలు జనవరి 5వ తేదీ లోపు ప్రకటించాలని వీణవంక మండలంలో ఉత్సాహంగా ఉన్న పార్టీ కార్యకర్తలు ఈ అవకాశం వినియోగించుకోవాలని ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని వారు అన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవుతుందని 2023లో పార్టీ అధికారం లోకి రావడానికి అందరం కలసి కట్టు గా పనీ చేయాలి వారు పిలుపునిచ్చారు. యువత కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుందని ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు నిరుద్యోగ భృతి, ఉద్యోగ నియమకాల్లో యువతకు ప్రాధాన్యత లేదని వారన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక టి పి సి సి సభ్యులు కర్ర భగవాన్ రెడ్డి అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ నాయకులు , గంగాడి రాజి రెడ్డి, చదువు జైపాల్ రెడ్డి, జున్నుతుల మధుకర్ రెడ్డి,ఒడ్డపల్లి కొమురయ్య,పెద్ది సంపత్ రెడ్డి,పైడి కుమార్, ఎండీ రజాక్, వెంకన్న, సదయ్య, శంకరయ్య తదితరులు పాలుగోన్నారు




